నా కాలు వచ్చేసిందోచ్..! చిన్నోడి ఎమోషన్ కు ఇంటర్నెట్ ఫిదా

ఆ చిన్నారి ఆనందానికి నెట్ యూజర్స్ మనసు కరిగిపోతోంది. ఆతడి ఆశలకు రెక్కలు రావడం చూసి ముచ్చటపడుతోంది. ఎంతో ఎమోషన్ తో ఆ చిన్నపిల్లోడు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ చిన్నోడి పేరు అహ్మద్ సయ్యద్ రెహ్మాన్. అతడిది ఆప్ఘనిస్థాన్ దేశం. 8 నెలల చిన్న వయసులో ఉన్నప్పుడు రెహ్మాన్ కుడికాలు తీసేశారు. తాలిబాన్లు, ఆప్ఘన్ పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో… ఈ చిన్నపిల్లాడి కుడి కాలులోకి బుల్లెట్ చొచ్చుకుపోయింది. అలా అతడి కాలు తీసేశారు. ఇప్పుడతని వయసు నాలుగేళ్లు. ఈ నాలుగేళ్లలో ఇప్పటికే నాలుగుసార్లు అతడికి కృత్రిమ కాలు అమర్చారు. అన్నిసార్లు ఫెయిలైంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఐదోసారి ప్రొస్తెటిక్ లెగ్ అమర్చారు. ఆప్ఘనిస్థాన్ లోని రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో.. ఈసారి కృత్రిమ కాలు ఆపరేషన్ సక్సెస్ అయింది. దీంతో.. ఆ బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

కాలు వచ్చేసిందంటూ చిన్నారి రెహ్మాన్ పట్టరాని ఆనందంతో సంబరపడిపోయాడు. హాస్పిటల్ గదిలోనే చుట్టూ తిరుగుతూ గంతులు వేశాడు. అతడి అమాయకత్వం.. అతడి ఆనందం..  ఇలా వీడియో రూపంలో వైరల్ అవుతోంది. నెట్ యూజర్స్ ను ఫిదా చేస్తోంది.

Latest Updates