ISIS కమాండర్ మునీబ్ మహమ్మద్ అరెస్ట్

ISIS ఉగ్ర సంస్థ ఖొరసాన్ విభాగానికి చెందిన టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ తెలిపింది. మునీబ్ పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అని తెలిపింది.

మునీబ్ అత్యంత కీలకమైన ఉగ్రవాది అని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ చెప్పింది. ఇతనికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో పాటు ఉగ్ర సంస్థలైన హక్కానీ నెట్ వర్క్, లష్కరే తాయిబా, జమాత్ ఉల్ ఉలేమా, సిపా ఈ సహబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ సంస్థల మధ్య మునీబ్  మీడియేటర్ లా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. ఐఎస్ఐ, ఉగ్ర సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. ఐసిస్ లో చేరక ముందు మునీబ్ లష్కరే తాయిబాలో కీలకంగా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో తేలిందని చెప్పింది.

Latest Updates