ఇన్ పేషెంట్లుగా చేరాలంటే భయపడుతున్నారు

ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు జనాల్లో భయాందోళన

కరోనా పేషెంట్లు లేని ఆస్పత్రులకే వెళ్లి అడ్మిట్

అవసరమైతే రెగ్యులర్ హాస్పిటల్ నుంచి షిఫ్టిం గ్

ఎమర్జెన్సీ కాకపోతే సర్జరీలు పోస్ట్ పోన్

 సిటీలోని సైనిక్ పురికి చెందిన సతీశ్ (36) ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్. డ్యూటీకి వెళ్తుం డగా బైక్ పై నుంచి పడడంతో కాలు ఫ్యాక్చర్ అయింది. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. నాలుగు రోజుల ట్రీట్ మెంట్ తీసుకోగా ఫీవర్ వచ్చింది. కరోనా టెస్టు చేయగా పాజిటివ్ గా రావడంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటెయిన్ లో ఉన్నాడు. హాస్పిటల్లోనే సోకి ఉంటుందని అనుమానించాడు.

వికారాబాద్ జిల్లా కు చెందిన ఓ వ్యక్తి (55), అనారోగ్య సమస్యతో సిటీలోని ఓ హాస్పిటల్ లో ఇన్ పేషెంట్ గా ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. వారం రోజుల తర్వాత కరోనా సింటమ్స్ కనిపించడంతో టెస్టు లు చేయగా పాజిటివ్ గా తేలింది. వెంటనే ఆ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ లోని వేరే హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్చించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లని ఆయనకు కరోనా సోకడమేంటని పరేషాన్ అయ్యారు. ఫస్ట్ చేరిన ఆస్పత్రిలోనే వైరస్ సోకి ఉంటుందని అనుమానించారు.

హైదరాబాద్ ,వెలుగు:హెల్త్ ప్రాబ్లమ్స్​,  సర్జరీ ల కోసం హాస్పిటల్ కు వెళ్లి ఇన్ పేషెంట్లుగా  చేరి ట్రీట్ మెంట్ చేయించుకోవాలంటేనే   పేషెంట్లు  హడలెత్తిపోతున్నారు. కరోనా పేషెంట్లు లేని దవాఖానాల కోసం
ఆరా తీస్తున్నారు. తప్పనిసరి అయితే రెగ్యూ లర్ గా వెళ్లే ఆస్పత్రుల నుంచి ఇతర హాస్పిటళ్లకు షిఫ్ట్ అవుతున్నారు. సేఫ్ గా లేకుంటే ఫ్యామిలీ డాక్టర్లనూ కాదని వేరే చోటకు వెళ్తున్నారు. కరోనా పేషెంట్లు ఉన్న దగ్గర ఉంటే తమకు కూడా సోకుతుందన్న భయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో అవుతున్నాయి.

సర్జరీ లు, ఇతర అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ల​లో చేరి ట్రీట్మెంట్ పూర్తయి ఇంటికి వచ్చాక కరోనా బారినపడిన వారూ ఉన్నారు. దీంతో పేషెంట్లు అలర్ట్ గా ఉంటున్నారు. సర్జరీలు ఎమర్జెన్సీ కాకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటూ మెడిసిన్స్​తో సరిపెట్టుకుంటున్నారు. అత్యవసరమైతేనే అన్ని విధాలు చూసుకొని ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అవుతున్నారు. రెం డు నెలల క్రితం నిమ్స్​ హాస్పిటల్ గుండె సంబంధిత విభాగంలో ట్రీట్ మెంట్ పొందుతున్న రోగులకు కరోనా సోకింది. ఆ డిపార్ట్ మెంట్ డాక్టర్లకు పాజిటివ్ రావడంతో పేషెంట్లందరికీ చెక్ చేయగా ఇద్దరికి కరోనా వచ్చింది. ఇలాంటి సంఘటన చాలా చోట్ల జరుగుతున్నా బయటకు రావడం లేదు.

కరోనా పేషెంట్లు లేకుంటేనే అడ్మిట్..

కొవిడ్ పేషెంట్స్​, అన్ని విధాలుగా సేఫ్ గా ఉన్న హాస్పిటల్ల కోసం ఆరా తీస్తున్నారు. నిర్ధారణ అయ్యాకే ట్రీట్ మెంట్ కోసం ఇన్ పేషెంట్ గా చేరుతున్నారు. అది కూడా ట్రీట్ మెం ట్ అత్యవసరమైతేనే వెళ్తున్నారు. కరోనా పేషెంట్లు ఉంటే వైరస్ తమకు కూడా సోకే ప్రమాదం ఉందని భావించి ఇలా చేస్తున్నట్లు పలువురు పేషెంట్లు చెబుతున్నారు.

పోస్ట్ పోన్ చేసుకుంటూ..

చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు చాలావరకు ఆస్పత్రులకు వెళ్లడంలేదు. ఆన్లైన్ లో డాక్టర్లను సంప్రదించి మెడిసిన్ వాడుతున్నారు. రెగ్యులర్ గా వెళ్లే హాస్పి టల్ అయితే ఫోన్ ద్వారా డాక్టర్లను సంప్రదించి ట్రీట్ మెం ట్ పొందుతున్నారు. సర్జరీలు కూడా ఎమర్జెన్సీ కాకపోతే రెండు, మూడు నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.

సోకే ప్రమాదం ఉండడంతోనే..

ఇంతకుముందు దవాఖానాలో తెలిసిన వాళ్లు అడ్మిట్ అయ్యారంటే వెళ్లి పరామర్శించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు. కరోనా కాకుండా ఇతర వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరిన కూడా ఎవరూ వెళ్లడం లేదు. కరోనా భయంతోనే ఆస్పత్రుల వైపు పోవడంలేదు. కరోనా పేషెంట్లు​ లేని హాస్పిటల్ అయితే బెస్ట్ అనుకుంటున్నారు. హాస్పిటల్లలో  ట్రీట్ మెంట్ టైంలో పేషెంట్స్​ చాలా కేర్ తీసుకుంటున్నారు.

సేఫ్టీ చూసుకుంటున్నరు

నాన్ కరోనా పేషెంట్స్​ హాస్పటల్స్​లో చేరాలంటే అన్ని విధాలుగా ఆలోచించి చేరుతున్నారు. పాజిటివ్ పేషెంట్స్​ ఉన్న వాటిలో చేరితో కరోనా సోకే ప్రమాదం ఉందని సేఫ్టీ కోసం ఇలా చేస్తున్నారు. ఎన్నో జాగ్తత్తలు తీసుకొని ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లకు కూడా కరోనా సోకుతుంది. జనాలు సర్కార్ దవాఖానలకు వెళితే ట్రీట్ మెం ట్ అందుతదో లేదోనని ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రైవేటులో కూడా బెడ్లు చాలా వరకు ఖాళీగా ఉంచుతున్నారు. స్టాఫ్ లేకపోవడంతో 40 శాతం పడకలు మాత్రమే రన్ చేస్తున్నారు.

‑ డాక్టర్ విజయ్ భాస్కర్, ఎథిక్ స్ కమిటీ క్లినికల్ ట్రయల్సు అండ్ రీసెర్చి చైర్మన్.

Latest Updates