13 ఏళ్లైనా నో ఛేంజ్.. విజయశాంతికి మేకప్ టైమ్…

after-13-years-its-make-up-time-for-vijayashanthi

లేడి అమితాబ్ గా పిలుచుకునే విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 2006 తెలుగులో విజయశాంతి నటించిన నాయుడమ్మ లాస్ట్ మూవీ. ఆ తర్వాత ఆమె ఇంత వరకు ఎటువంటి సినిమాల్లో యాక్ట్ చేయలేదు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్నసరిలేరు నీకెవ్వరు మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే విజయశాంతి మళ్లీ ఇన్నాళ్లకు మేకప్ వేసుకుని షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపుడి తన ట్విట్టర్లో తెలిపారు.‘  13  ఏళ్ళ తర్వాత విజయశాంతి మేడమ్ మేకప్ వేసుకున్నారు. మేడమ్ కు మేకప్ టైమ్. ఇన్నేళ్లయినా ఆమెలో ఎటువంటి మార్పు లేదు.అదే అటిట్యూడ్, క్రమశిక్షణ. మేడమ్ కు స్వాగతం‘ అంటూ ట్వీట్ చేశారు.

Latest Updates