దూర‌దర్శన్‌లో రికార్డులు సృష్టిస్తున్న రామాయణం

  • 33 సంవత్సరాల తర్వాత రీ టెలికాస్ట్‌
  • ట్వీట్‌ చేసిన డీడీ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో ప్రజలను ఎంటర్‌‌టైన్‌ చేసేందుకు దూర‌దర్శన్‌ టెలికాస్ట్‌ చేస్తున్న రామానంద్‌ సాగర్‌‌ రామాయణం రికార్డుల మోత మోగిస్తోంది. 33 సంత్సరాలైనా ప్రజల నుంచి షోకు ఉన్న ఆదరణ తగ్గలేదని దూర‌దర్శన్‌ వర్గాలు చెప్పాయి. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఎంటర్‌‌టైన్మెంట్‌ షోలో ఒకటిగా నిలిచిందని ట్వీట్‌ చేసింది. “ దూర్‌‌దర్శన్‌లో రీ టెలికాస్ట్‌ చేసిన రామాయణ షోను ఏప్రిల్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా 7.7 కోట్ల మంది చూశారు” అని దూర్‌‌దర్శన్‌ ట్వీట్‌ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోఉండే ప్రజలకు బోర్‌‌ కొట్టకుండా డీడీ చానల్‌ పాత సీరియళ్లు, షో లను రీ టెలికాస్ట్‌ చేసింది. దీంట్లో భాగంగానే మార్చిలో రామాయణం షో ను ప్రారంభించింది. రోజుకు రెండు సార్లు దీన్ని టీవీలో టెలికాస్ట్‌ చేసింది. రామానంద్‌ సాగర్‌‌ డైరెక్ట్‌ చేసిన రామాయణం మొదటి సారి 1987లో దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. అప్పట్లో అది ప్రతి ఆదివారం ఉదయం టెలికాస్ట్‌ చేసేవారు.

Latest Updates