గుండెపోటుతో ఆస్పత్రి పాలైన రైతు..బాధితుడి వెయ్యి ఎకరాల పంటను కోసిన తోటి రైతులు

పేపర్లో రైతుకు కష్టం వచ్చింది అనే హెడ్ లైన్ కనబడితే అయ్యో పాపం అని వదిలేస్తాం. కానీ అదే రైతు తన తోటి రైతుకు కష్టం వస్తే..ఆ కష్టానికి ఎదురెళ్లి నిలబడతారు. ఇక్కడ అదే జరిగింది.

వ్యవసాయం చేస్తున్న ఓ రైతుకు గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యాడు. తనకున్న వెయ్యిఎకరాల పొలంలో వేసిన గోధుమ మరియు కనోలా పంట చేతికొచ్చింది. పంటకోయకపోతే పడిన కష్టం అంతా వృధా అయిపోతుందని బాధపడ్డాడు. దీంతో తోటి రైతులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అనారోగ్యంతో బాధపడుతున్న రైతు వెయ్యిఎకరరాల పంటను కోశారు.

అమెరికాకు చెందిన నార్త్ డకోటాలోని క్రాస్బీ సమీపంలో ఉన్జెం అనే రైతు తన 1000ఎకరాల పొలాన్ని పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ సమయంలో రైతు ఉన్జెం పొలంలో వ్యవసాయం చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన తోటి రైతులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఉన్జెం ఆరోగ్యం బాగున్నా..తన వెయ్యి ఎకరాల పంటను ఎలా కొయ్యాలా అని మనోవేధనకు గురయ్యాడు.

దీంతో ఉన్జెం మనోవేధనను అర్ధం చేసుకున్న తోటి రైతులు తన కుటుంబ సభ్యులు, చుట్టాలు ఇలా సుమారు 60మంది రైతులు కలిసి బాధితుడు ఉన్జెంకు ఉన్న వెయ్యి ఎకరాల పంటను ట్రాక్టర్ల సాయంతో కోశారు. వెయ్యి ఎకరాల పంటను కోసేందుకు 7గంటలు పట్టినట్లు రైతులు తెలిపారు. ప్రస్తుతం ఆ రైతులు చేసిన సాయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా తోటి రైతులు మాట్లాడుతూ రైతు ఉన్జెం పండించిన పంటను వదిలేయడం కుటుంబానికి పెద్ద నష్టం. మానవత్వం, ఇంగితజ్ఞానంతో ఉన్జెంకు సాయం చేశాం. ఉన్జెం ప్రతీఒక్కరికి తెలిసు. చాలా మంచివాడు. తోటి వారికి కష్టం వస్తే ఏం ఆశించకుండా సాయం చేస్తాడు. అందుకే మేం ఆశించకుండా పనిచేశాం. ప్రస్తుతం రైతు ఉన్జెం ఆరోగ్య పరిస్థితి బాగుందని కొద్దిరోజుల్లో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అవుతారని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.Latest Updates