పేదలను దోచుకొని మిత్రులకు సాయం చేస్తున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ బిల్లులపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తమ మిత్రులకు ప్రయోజనం చేకూర్చడానికి పేద ప్రజలను దోచుకుంటోందన్నారు. 100 నుంచి 300 మంది ఎంప్లాయీస్ ఉన్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తొలగించేందుకు వీలు కల్పించే మూడు కీలక బిల్లులను బుధవారం పార్లమెంట్‌‌ ఆమోదించింది. ఈ నేపథ్యంలో వీటిపై రాహుల్ రెస్పాండ్ అయ్యారు. తాజా బిల్లుల ద్వారా రైతుల తర్వాత లేబర్‌‌ క్లాస్‌‌పై సర్కార్ దాడి చేసిందన్నారు. ‘రైతుల తర్వాత లేబర్ క్లాస్ మీద దాడి జరిగింది. పేదలకు కంట శోష మిగిల్చి మిత్రులను పోషిస్తున్నారు. పేదలను దోచుకొని మిత్రలుకు సాయం చేయడం మోడీజీ అధికారాన్ని సూచిస్తోంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

Latest Updates