రామ సేతు అపోహా? వాస్తవికతా?.. ఆసక్తిగా అక్షయ్ కొత్త మూవీ

ముంబై: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజాగా లక్ష్మీ బాంబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లారెన్స్ నటించిన హిట్ సిరీస్ కాంచనకు రీమేక్‌‌గా లక్ష్మీ బాంబ్ తెరకెక్కింది. డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్‌‌లో విడుదలైన ఈ మూవీకి మిక్స్‌‌డ్ టాక్ వచ్చింది. అయినా మంచి వ్యూస్ వస్తుండటం విశేషం. ఈ విషయాన్ని పక్కనబెడితే అక్షయ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి స్పందించాడు.

రామ్ సేతు పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను ట్విట్టర్‌‌లో అక్షయ్ షేర్ చేశాడు. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతోపాటు విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌‌లో సముద్రపు నీళ్లు, వాటిపై బాణంతో నిల్చున్న రాముడు.. ముందువైపు అక్షయ్ నడుస్తున్నట్లుగా ఉన్న ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ సేతు అపోహా లేదా వాస్తవికతా అనే క్యాప్షన్ ఆకర్షిస్తోంది.

Latest Updates