‘ఆర్టీసీ తర్వాత కేసీఆర్ కన్ను దాని మీదే’

వెంకటస్వామి రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నారు

హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసిన తర్వాత సింగరేణిని కూడా ప్రైవేట్‌పరం చెయ్యాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారని బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. అందరూ కలిసి తెలంగాణ సాధిస్తే.. కేసీఆర్ ఒక్కడే లాభపడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అప్పట్లో వెంకటస్వామి రాష్ట్రపతి అయితే తెలంగాణ వస్తదనే కారణంతోనే వెంకటస్వామిని రాష్ట్రపతి కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారని ఆయన ద్వజమెత్తారు. సీఎం కేసీఆర్.. కూతురు కవితను హెచ్.సి.ఏ ప్రెసిడెంట్ చెయ్యడానికి తనను పోటీ నుండి తప్పుకోవాలని కోరారని ఆయన తెలిపారు. కొడుకుకు మంత్రి పదవి, బిడ్డ ఓడిపోయినందుకు మరో పదవి, ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని చూసుకున్నందుకు సంతోష్ కుమార్‌కు రాజ్యసభ పదవి ఇచ్చి తెలంగాణను కల్వకుంట్ల తెలంగాణగా మార్చాలని సీఎం కేసీఆర్ అనుకున్నారని ఆయన అన్నారు. తాను టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా వున్నానని ఆయన తెలిపారు. సింగరేణి కార్మికులపై ఇన్‌కంటాక్స్ భారం పడకుండ మైనింగ్ సెస్ నుంచి 220 కోట్లు తిరిగి కార్మికులకు వచ్చేలా బీఎంఎస్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Latest Updates