అద్వానీ, జోషీలను ఇన్వైట్‌ చేయడంపై క్లారిటీ ఇచ్చిన టెంపుల్‌ ట్రస్ట్‌

  • వాళ్లకి ఫోన్ ద్వారా ఇన్వైట్‌ చేస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌‌ లీడర్లు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషిలను అయోధ్య రామమందిరం శంకుస్థాపనకు కచ్చితంగా పిలిచి తీరుతామని రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లోని సభ్యుడు ఒకరు మీడియాతో చెప్పారు. వాళ్లను ఫోన్‌ చేసి ఇన్వైట్‌ చేస్తామని చెప్పారు. మిగతా వారికి ఆహ్వానం ఇచ్చినట్లే వాళ్లను కూడా పిలుస్తామని అన్నారు. ఇన్విటేషన్‌కి సంబంధించి పనులన్నీ జనరల్‌ సెక్రటరీ చంపత్‌ రాయ్‌ చూసుకుంటున్నారు. అయోధ్య భూమి పూజకు బీజేపీ సీనియర్‌‌ నేత ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషీలకు ఆహ్వానం అందలేదని, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌లకు మాత్రమే ఇన్విటేషన్‌ వచ్చిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రస్ట్‌ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామమందిరం నిర్మాణం ఉద్యమాన్ని ఉదృతం చేసిన వారిలో అడ్వానీ, మురళీమనోహర్‌‌ జోషి, ఉమాభారితి తదితర నేతలే కీలకం. వీళ్లపై ఇప్పటికే దానికి సంబంధించి కోర్టులో కేసు విచారణలో ఉంది.

Latest Updates