ఆక్సిజన్ ట్రీట్ మెంట్ తో వయసు​ తగ్గించొచ్చట

ఎప్పటికీ యంగ్‌‌గానే ఉండాలని ఎవరికి అనిపించదు? అలా అనిపించింది కదా అని ఉండిపోవడమూ కుదరదు. ఒక్కమాటలో చెప్పాలంటే కాలం ఉండనియ్యదు కదా!  పసితనం నుంచి  ఒక్కొక్క దశను దాటుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాం.కానీ, ఎక్కడో ఒక మూలన చిన్న ఆశ.. ‘మళ్లీ యవ్వనంలోకి వెళ్తే బాగుండు’ అని. అలా వెళ్లేందుకు చాలాకాలం నుంచి సైంటిస్టులు స్టడీలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఇజ్రాయిల్ సైంటిస్టులు ఈ స్టడీలో ఒక అడుగు ముందుకు వేశారు. ఆక్సిజన్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సాయంతో ఏజింగ్ ప్రాసెస్‌‌ని రివర్స్ చేశారు!

రీసెర్చ్‌‌లో భాగంగా 64 ఏళ్లకు పైగా వయసున్న 35 మందిని తీసుకున్నారు. వీళ్లందరికీ రెగ్యులర్‌‌‌‌గా హైపర్‌‌‌‌బారిక్ ఆక్సిజన్‌‌ ట్రీట్‌‌మెంట్స్‌‌ (హెచ్‌‌బీఓటీ) 90 నిమిషాల పాటు అందించారు. వారానికి 5రోజులు చొప్పున మూడు నెలలు ఈ ట్రీట్‌‌మెంట్‌‌ని కంటిన్యూ చేశారు. ఇలా చేయడం వల్ల శరీరంలో పని చేయకుండా ఉన్న కణాలన్నీ తిరిగి పుంజుకున్నాయి. ‘‘బేసిక్ లెవల్‌‌లో హెచ్‌‌బీఓటీ ఏజింగ్ ప్రాసెస్‌‌ని రివర్స్ చేయగలదని ప్రూవ్ అయింది. ఈ రీసెర్చ్‌‌ని మరింత ముందుకు తీసుకెళ్తాం”అని ప్రొఫెసర్ షాయి ఇఫ్రాటి అన్నాడు. ఈ స్టడీని ఈయనే లీడ్ చేశాడు. టెల్‌‌ అవివ్‌‌ యూనివర్సిటీ, షమీర్‌‌‌‌ మెడికల్ సెంటర్ సైంటిస్ట్‌‌లు కలిసి ఈ రీసెర్చ్ చేశారు.

స్లో ఏజింగ్‌‌

జపాన్ సైంటిస్టులు కూడా రీసెంట్‌‌గా ఇలాంటి రీసెర్చ్‌‌నే చేశారు.  శరీరంలో ఉండే ఒక ఇంటర్నల్ ప్రొటీన్ ఏజింగ్ ప్రాసెస్‌‌ని ఆపుతుందని వీళ్లు కనుక్కున్నారు. ఈ ఇంటర్నల్ ప్రొటీన్‌‌ని ఎరిత్రాయిడ్‌‌-2 అని పిలుస్తారు. ఈ స్టడీని ఎలుక మీద చేశారు. ఆ ఎలుకను ముందుగా ఇంటర్నేషనల్‌‌ స్పేస్ స్టేషన్‌‌కి పంపించారు. ఇలా చేయడం వల్ల ఇంటర్నల్‌‌ ప్రొటీన్ ఏజింగ్‌‌ ప్రాసెస్‌‌ నెమ్మదించింది. ఈ ప్రొటీన్ నెమ్మదించడం వల్ల ముసలితనం నెమ్మదిగా వస్తుంది. స్పేస్‌‌లోకి ఎలుకను తీసుకెళ్లిన తర్వాత అది కింద ఉన్నప్పుడు ఎంత ఫుడ్ ఇచ్చారో.. అంతే ఫుడ్ ఇవ్వగా ఇంటర్నల్ ప్రొటీన్ వెయిట్‌‌ పెరగలేదు. వయసు మీద పడటం వల్ల వచ్చే డయాబెటిస్‌‌, అల్జీమర్స్‌‌ లాంటి వ్యాధులకు డ్రగ్స్ కనిపెట్టేందుకు ఈ స్టడీ హెల్ప్ చేస్తుందంటున్నారు.  టోహోకు యూనివర్సిటీ, జపనీస్ స్పేస్ ఏజెన్సీ జాక్సా కలిసి ఈ స్టడీ చేశారు.  ఒకవేళ ఈ రీసెర్చ్‌‌లు సక్సెస్‌‌ అయితే.. ఎవర్‌‌‌‌ యంగ్‌‌గా ఉండొచ్చేమో!

Read more news…

బాలీవుడ్‌లోకి ప్రభాస్ ఛత్రపతి.. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్

కరోనా పేషెంట్లకు నేటి నుంచే పోస్టల్ బ్యాలెట్ అవకాశం

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

Latest Updates