కరోనా రూల్స్ కు వ్యతిరేకంగా.. విదేశాల్లో నిరసనలు

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. దాని బారిన పడకుండా ఉండాలంటే ప్రతిఒకరు మాస్క్‌‌‌‌ పెట్టుకోవాలి. సోషల్‌‌‌‌ డిస్టెన్సింగ్‌‌ పాటించాలని మొదటినుంచి సూచిస్తూనే ఉన్నారు. కానీ కొంతమందికి మాస్క్‌‌‌‌ పెట్టుకోవడం ఇబ్బంది అవుతోంది అంట.

కరోనా వైరస్​ వ్యాప్తి మొదలవ్వగానే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. దాంతో పాటు కొన్ని లాక్​డౌన్​ కండిషన్లు కూడా పెట్టాయి. ఇప్పుడు లాక్​డౌన్​ని అన్​లాక్​ చేస్తున్నా, ఫేస్​మాస్క్​, ఫిజికల్​ డిస్టెన్స్​లాంటి కొన్ని లాక్​డౌన్​ రూల్స్​ని మాత్రం కంటిన్యూ చేశాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది.. కానీ కొన్ని దేశాల్లో ఫేస్​మాస్క్​ని కంపల్సరీ చేసిన రూల్​తో పాటు ఇంకొన్ని కండిషన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు.

అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇటలీ, కెనెడా దేశాల్లో కొన్నిరోజులుగా చాలా మంది లాక్​డౌన్​ రూల్స్​కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి గొడవ చేస్తున్నారు. రెగ్యులర్​గా ఫేస్​మాస్క్​లు పెట్టుకుంటే కార్బన్​ డయాక్సైడ్​ స్థాయి పెరిగి ఆక్సిజన్​ తగ్గి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇదే పాయింట్​తో చాలాచోట్ల ర్యాలీలు చేస్తున్నారు. రూల్స్​ పేరుతో అధికారులు తమ పర్సనల్​ రైట్స్, ఫ్రీడమ్​కు అడ్డుపడుతున్నారని మరికొందరు అంటున్నారు.

లండన్ లో యునైట్ ఫర్ ఫ్రీడమ్..

ఆగస్ట్‌‌ నెలలో వేలమంది లండన్​లోని ట్రాఫల్గర్​ స్క్యేర్​ ప్రాంతంలో గుమిగూడి ఓపెన్​గా చెప్పారు. కోవిడ్​ సేఫ్టీ మెజర్స్​పై యూకే ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ‘యునైట్​ ఫర్ ​ఫ్రీడమ్​’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. పైగా అందులో ఫేస్​మాస్క్​లు పెట్టుకోకుండా, ఫిజికల్​ డిస్టెన్స్​ కూడా పాటించకుండా ‘మాస్క్స్​ ఆర్​ మసిల్స్​’, ‘కోవిడ్​ ఈజ్​ ఏ హాక్స్​’ అనే స్లోగన్స్​తో  నిరసనలో పాల్గొన్నాయి యాంటీ లాక్​డౌన్​ గ్రూప్స్​. అక్కడున్న హిస్టారిక్​ నెల్సన్స్​ కాలమ్​ మాన్యుమెంట్​పైకి ప్రొటెస్టర్లు ఎక్కిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

స్కాట్​ల్యాండ్​ ప్రొటెస్ట్

ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ ఐదారు వందల మంది తమ పిల్లలతో సహా స్కాట్​ల్యాండ్​లోని ఎడెన్​బరో​లో ఉన్న పార్లమెంట్​ బిల్డింగ్​ దగ్గరకు చేరారు.  ‘సేవింగ్​ స్కాట్​ల్యాండ్​’ పేరుతో తయారైన గ్రూప్​ ఈ మార్చ్​ని ఆర్గనైజ్​ చేసింది. ఈ నిరసనకు సంబంధించి ఆ గ్రూప్​ ఫేస్​బుక్​లో కూడా ‘మనందరం కలిసి పోరాడాల్సిన సమయం ఇది. మన దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత’ అంటూ ప్రచారం కూడా చేస్తోంది.  ‘ఈ లాక్​డౌన్​ వైరస్​ కన్నా చాలా ప్రమాదకరం. మ్యాండేటరీ మాస్క్​లకు నో చెప్పండి. అలాగే సెకండరీ లాక్​డౌన్​ని కూడా వ్యతిరేకిద్దాం’ అంటున్నారు సేవింగ్​ స్కాట్​ల్యాండ్​ గ్రూప్​ సభ్యులు. స్కాట్లాండ్​ నేషనల్​ క్లినికల్​ డైరెక్టర్​ ఈ నిరసన గురించి మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా బాధ్యత లేకుండా చేస్తున్న ప్రొటెస్ట్. ఇది మన ఒక్క దేశంలో నడుస్తున్న రూల్స్​ కాదు. ప్రపంచవ్యాప్తంగా అది కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే రూల్స్​ పెట్టారు’ అన్నాడు.

రోమ్​లో నిరసన

గత వారం వెయ్యి మందికి పైగా యాంటీ మాస్క్​ యాక్టివిస్ట్​లు ఇటలీ రాజధాని రోమ్​లో రోడ్లమీదకు వచ్చారు. స్కూల్లో పిల్లలకు ఫేస్​మాస్క్​లను మ్యాండేటరీగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ యాంటీ వ్యాక్సిన్​ యాక్టివిస్ట్​లు, కాన్​స్పిరసీ థీరిస్ట్​లు ర్యాలీ తీశారు. ‘నో మాస్క్​.. నో సోషల్​ డిస్టెన్సింగ్​’, ‘పర్సనల్​ ఫ్రీడమ్​ ఈజ్​ ఇన్​వయొలబుల్​’, ‘లాంగ్​ లివ్​ లిబర్టీ’ వంటి స్లోగన్స్​, బ్యానర్లతో కోపాన్ని చూపించారు. ‘దేశంలో కొత్తగా లాక్​డౌన్​ని ప్రకటించట్లేదు. కాకపోతే కొన్నిచోట్ల ఎమర్జెన్సీ రూల్స్​ ఉంటాయి’ అంటూ ఇటలీ ప్రధాని గ్యుసెప్పె కాంటె ట్వీట్​ కూడా చేశాడు.

మెల్‌‌బోర్న్‌‌ అరెస్ట్​లు

ఆస్ట్రేలియాలోని మెల్‌‌బోర్న్‌‌​లో సుమారు మూడొందల మంది లాక్​డౌన్​ రూల్స్​కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్​ చేశారు. ఆరువారాలుగా సాగుతున్న  స్ట్రిక్ట్​ లాక్​డౌన్​ పౌరహక్కులను కాలరాయడమేనని చాలామంది అభిప్రాయపడుతూ ప్లకార్డ్స్​ పట్టుకుని రోడ్ల మీదకు వచ్చారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, బైరన్​ బే ప్రాంతాల్లోనూ ఇలాంటి ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే అక్కడి పోలీస్​ అధికారులు పదిహేను మందిని  అరెస్ట్​ కూడా చేశారు.

అమెరికావ్యాప్తంగా..

కరోనా వైరస్​ వ్యాప్తి మొదలైనప్పటి నుంచే ఫేస్​మాస్క్​లు పెట్టుకుంటున్నారు అమెరికన్లు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో కూడా దేశవ్యాప్తంగా  యాంటీ మాస్క్​ ర్యాలీలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు.  అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా మాస్క్​లను మ్యాండేటరీ చేయడంతో వందలమంది  యాంటీ మాస్క్​ ప్రొటెస్టర్స్​ నిరసనకు దిగారు.

 

Latest Updates