తాజ్ మహల్‌ని సందర్శించిన ట్రంప్ దంపతులు

చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను ట్రంప్ దంపతులు సోమవారం సందర్శించారు.  అహ్మదాబాద్‌లో మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం అనంతరం ట్రంప్‌ దంపతులు ఆగ్రా వెళ్లారు. ఆగ్రా ఎయిర్‌పోర్టులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వారికి అక్కడ ఘన స్వాగతం పలికారు.  ఆ తర్వాత ట్రంప్‌.. భార్య మెలానియా ట్రంప్, కూతురు ఇవాంక తో కలసి తాజ్ మహల్ ని దర్శించారు. ఆ చారిత్రక కట్టడం వివరాలను గైడ్ వారికి వివరించారు. ఈ సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్‌ దంపతులు ఢిల్లీ బయలుదేరనున్నారు.

Latest Updates