హైదరాబాద్ లో తొలిసారి: అగ్రి బిజినెస్‌ సమ్మిట్‌ అవార్డ్స్‌ 2019

సికింద్రాబాద్ : ప్రతిష్టాత్మక అగ్రి బిజినెస్‌ సమ్మిట్‌ అవార్డ్స్‌ 2019 ఈవెంట్‌  హైదరాబాద్‌లో వచ్చేవారం జరగనుంది. హోటల్‌ పార్క్‌ హయత్‌లో ఈ నెల 27న సాయంత్రం నిర్వహించనున్నారు. ఎన్నో వ్యాపార, నెట్‌ వర్కింగ్‌ అవకాశాలకు, బ్రాండ్‌ పొజిషనింగ్‌కు ఈ ప్రోగ్రామ్ వేదిక అంటున్నారు ఆర్గనైజర్స్.

వ్యవసాయ పరిశ్రమ ఉత్పాదనలకు గుర్తింపు ఇవ్వడానికి దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలకు చెందిన అధికారులు, హై ప్రొఫైల్ వ్యక్తులు, ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. 50కిపైగా కంపెనీలకు చెందిన 200 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు వస్తారు.

రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడం ఎలా అనేదానిపై చర్చిస్తారు. రైతులకు మద్ధతు ఇచ్చి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం ఎలా అనేదానిపై సమీక్ష జరుపుతామని అగ్రి బిజినెస్, ఐటి హెడ్, ఐటిసి డైరెక్టర్‌ శివకుమార్‌ , కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ మాజీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రవి ప్రసాద్‌ చెప్పారు. కార్యక్రమంలో ‘భారతదేశంలో భావి తరాలకు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం భవిష్యత్తు ధోరణులు’ అనే అంశంపై ధనూకా గ్రూప్‌ చైర్మన్‌ ఆర్‌.జి అగర్వాల్‌ కీలకోపన్యాసం చేస్తారు. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో వ్యవసాయోత్పత్తుల పరిశ్రమ పాత్ర’ అనే అంశంపై ప్యానెల్‌ చర్చను జ్యూరీ జరుపనుంది. భిన్న కేటగిరీల్లో వ్యవసాయ సంబంధ పురస్కారాలు అందిస్తారు.

Latest Updates