అనుమానాస్పద రీతిలో అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ మృతి

Agri gold Vice president Sadashiva vara prasad rao Suspicious Death

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు గత రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో పార్శిల్ కౌంటర్ దగ్గరకు రాగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించేలోపే ఆయన ప్రాణం విడిచారు.

సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.అయితే ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Latest Updates