కిరాయికి వ్యవసాయ పనిముట్లు.. సెంట్రల్ గవర్నమెంట్ సరికొత్త స్కీం

పంటల కలుపు తీయాలంటే కూలీలు దొరకరు. కలుపు తీసే మెషీన్‌ కొందామంటే.. వేలకు వేల రూపాయలు కావాలి. అందుకే పెట్టుబడి ఎక్కువగా పెట్టలేని చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ సెంటర్‌‌ పెట్టారు. ఇక్కడ అన్ని రకాల అగ్రికల్చర్‌‌ మెషీన్లు అద్దెకు ఇస్తారు. ఈ సెంటర్‌‌ని సెంట్రల్‌ గవర్నమెంట్‌ సాయంతో ఈ మధ్యే మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎక్కడుందంటే..

భీమదేవరపల్లి, వెలుగు: మహిళలకు ఉపాధి కల్పించేందుకు, సన్నకారు రైతులకు సాయం చేసేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. వ్యవసాయ అవసరాలకు వాడే మెషీన్లను కిరాయికి ఇచ్చే సెంటర్లను వెయ్యికి పైగా మంజూరు చేసింది. వీటిని దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ​ వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్​లో ఒక ‘కస్టమ్​ హైరింగ్​ సెంటర్’ను ఏర్పాటు చేశారు. నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మెషీన్‌ కింద ఏర్పాటు చేసిన ఈ సెంటర్లు డిస్ట్రిక్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (డీఆర్​డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సెల్ఫ్​ హెల్ఫ్​ గ్రూప్​ మెంబర్స్‌ వీటిని నడుపుతున్నారు. ఇందులో రైతులకు తక్కువ ధరకే మెషీన్లను కిరాయికి ఇస్తున్నారు.

డిస్ట్రిక్ట్​​ పర్చేజింగ్​ కమిటీ

కలెక్టర్​ ప్రెసిడెంట్‌గా ఉండే ‘డిస్ట్రిక్ట్​ పర్చేజింగ్ కమిటీ’ రైతులకు ఉపయోగపడే అత్యాధునిక వ్యవసాయ పరికరాలు కొనేందుకు కావాల్సిన డబ్బు ఇస్తుంది. ములుకనూర్​లోని ‘కస్టమ్​ హైరింగ్​ సెంటర్’కు ట్రాక్టర్​, ట్రాలీ, రోటవేటర్​, కల్టివేటర్, ఫ్లవ్​, ప్యాడి బేటర్​, మేజ్​ షెల్లర్​ లాంటి పనిముట్లు కొనిచ్చారు. పంటలకు మందులు స్ర్పే చేసే మెషీన్లు కూడా ఇచ్చారు. సెల్ఫ్​ హెల్ఫ్​ గ్రూప్​ సభ్యులు హార్వెస్టర్​, మినీ రైస్​ మిల్లు లాంటి మెషీన్లు కావాలని తీర్మానాలు చేస్తే అవి కూడా కొనిస్తారు.

సభ్యులే చూసుకుంటారు

ఈ సెంటర్​ నుంచి అందించే ప్రతి మెషీన్‌ని సభ్యులే చూసుకుంటారు. మొదటగా ఇన్​వార్డ్​ రిజిస్టర్​, బుక్​ ఆఫ్​ అకౌంట్స్​లో ఏ రైతుకు, ఏ మెషీన్‌, ఎప్పుడు అవసరం ఉంటుందో రాస్తారు. తర్వాత బయట మార్కెట్​ రేటు కంటే తక్కువ ధరకు కిరాయికి ఇస్తారు. వీటితో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఇంట్రెస్ట్ ఉంటే సూపర్​ మార్కెట్‌, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా డీఆర్​డీఏ రెడీగా ఉంది.

– గజ్జెల దేవానంద్, ఎపియం​

పేద రైతుకు వరం

భారతమాత మండల సమాఖ్య ఆధ్వర్యంలో 11,584 మంది సభ్యులు, 49మంది వివోలు, 1,012 ఎస్​హెచ్​జి గ్రూప్​లు సక్సెస్‌‌ఫుల్‌‌గా నడుస్తున్నాయి. మెంబర్స్‌‌కు పొదుపు సౌకర్యంతో పాటు అప్పులు కూడా ఇస్తున్నారు. ములుకనూర్, ముత్తారం, కొప్పూర్, భీమదేవరపల్లి, కొత్తపల్లి గ్రామాల రైతులకు వ్యవసాయ పెట్టుబడి తగ్గించేందుకు ఈ సెంటర్ ​ఏర్పాటు చేశాం. ఇది పేద రైతులకు వరం లాంటిది.

– పుల్ల సరిత, భారతమాత సమాఖ్య ప్రెసిడెంట్

For More News..

మనుషులకే కాదు.. పసులకూ ఓ హాస్టల్

స్టూడెంట్లకు పూలతో స్వాగతం పలుకుతున్న స్కూల్స్

రిపబ్లిక్ డే ‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే

Latest Updates