పొలంలో పసుపు రంగు కప్పలు

agriculture-land-yellow-frog

పొలంలో పసుపు రంగు కప్పలు కనిపించడంతో అన్నదాతలు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగింది. రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో తెల్లవారుజామున కురిసిన తేలికపాటి వర్షానికి పొలంలో పసుపు రంగులో కప్పలు కనిపించాయి. రైతు తన పొలంలో నారు మడి తయారు చేసుకోవడం కోసం పొలానికి నీళ్ళుబెట్టాడు. అయితే వర్షం తగ్గిన తర్వాత పొలానికి వెళ్ళాడు అక్కడ చూస్తే తన పొలంలోపసుపు రంగులో కప్పలు ఎగురుతూ కనిపించడంతో రైతు వాటి వైపు ఆశ్చర్యంగా చూశాడు.

ఇలాంటి పసుపురంగులో ఉన్న కప్పలను తానెప్పుడూ చూడలేదని ఇంకా ఎన్నో రకాల కప్పలు చూశాను ఇలాంటి రకం మొదటిసారి చూస్తున్నాను..అని తెలిపాడు రైతు. పసుపు రంగు కప్పలను చూడటానికి గ్రామస్థులు పొలంబాట పట్టారట.

Latest Updates