మరో ఒరిజనల్ మూవీకి సిద్ధమైన ఆహా

మరో ఒరిజనల్ మూవీకి సిద్ధమైన ఆహా

ఆహా సినిమా అంటేనే ఆహా అని అందరు అంటారు. అందుకు నిదర్శనమే ''కలర్ ఫోటో''. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలింగా అవార్డు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆహా ఇప్పుడు ''హైవే'' సినిమా తో మరోసారి అందరి మన్ననలను పొందడానికి సిద్ధమవుతుంది. ఆనంద్ దేవరకొండ, మానస హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం కే వి గగన్ దర్శకత్వంలో ఆహా స్క్రీన్స్ మీద తెరకెక్కబోతోంది. కాగా ఈ మూవీకి సంబంధించిన  పోస్టర్ ను ఆహా తాజాగా రిలీజ్ చేసింది.

కథ విషయానికివస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ 'డి' అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన తులసిని కాపాడుకోగల్గుతాడా? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ సినిమా ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి.