అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తాం: AIADMK

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందన్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే(AIADMK) చీఫ్ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం. శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పెట్టుకున్న పొత్తు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి తమిళనాడు మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

అమిత్‌షా కూడా AIADMK ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తమిళనాడులో కరోనాను నియంత్రించడానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు చేసిన కృషి అభినందనీయమన్నారు. తమిళనాడులో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉందన్నారు.  గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే ..తమిళనాడుకు ఏం చేసిందో చెప్పగలదా? అని అమిత్ షా ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన బుద్థి చెపుతున్నారన్నారు. తమిళనాడులో కూడా అదే జరుగుతుందన్నారు. 2జీ స్ప్రెక్టం కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదని విమర్శించారు అమిత్ షా.

Latest Updates