వడ్డీ వసూలు చేయడానికి జగదీష్ రెడ్డి మంత్రినా? వడ్డీ వ్యాపారా?

కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామనడం దారుణమన్నారు ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో లాస్ట్- కరెంట్ బిల్లులో ఫస్ట్ ఉందన్నారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. కేసీఆర్ ధనార్జన కోసమే పాలన సాగుతుందన్నారు. కరెంట్ బిల్లు వాయిదా పద్దతిలో కట్టకపోతే వడ్డీ వసూళ్లు చేస్తామనడం కరెక్ట్ కాదన్నారు. బిల్లులకు వడ్డీ వసూళూ చేయడానికి జగదీష్ రెడ్డి మంత్రినా? వడ్డీ వ్యాపారా?అని ప్రశ్నించారు. రెంట్ కట్టోద్దు అన్న ప్రభుత్వానికి- కరెంట్ బిల్లులు వసూలు చేసే హక్కు లేదన్నారు.  బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ చేస్తే- జీతాలు-నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు  ప్రభుత్వాన్ని కట్ చేస్తారన్నారు వంశీ చందర్.

see more news

కృష్ణా జలాలను కేసీఆర్, జగన్ కి అమ్మేశారు

వలస కూలీలపై కేసులు ఎత్తేసి.. 15 రోజుల్లో సొంతూళ్లకు పంపండి

24 గంటల్లో 9987 కరోనా కేసులు..331 మంది మృతి

Latest Updates