నేను PHD చేశా..రేవంత్ అలా మాట్లాడతాడనుకోలే: సంపత్

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏఐసీీసీ కార్యదర్శి సంపత్. రేవంత్ తనకు అన్నలాంటివాడని..ఆయన అలా మాట్లాడుతారని అనుకోలేదన్నారు. యురేనియం గురించి తనకు ఏమి తెలియదడాన్ని చింతిస్తున్నాని చెప్పారు. తాను ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడనని..ఎంబీఏ, పీహెచ్ డీ చేశానని అన్నారు. జనసేన అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డిని ఎవరు పిలవలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డిని తనను  మాత్రమే పిలిచారని అన్నారు. నాదెండ్ల మనోహర్ చేత చెప్పించుకుని రేవంత్ మీటింగ్ కు వచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి అఖిల పక్షం లో మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కాదన్నారు. రేవంత్ రెడ్డి సినిమాలో మాదిరిగా అన్ని తానే అనుకుంటే ఎలా అన్ని పాత్రలు తాను చేయడు లేడని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి హుజూర్ నగర్ ఉపఎన్నిక టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ కి అడుగుతామన్నారు. ను పడుతాను..

Latest Updates