తప్పు ఒప్పుకున్న ఎయిమ్స్: ఎంపీ ఆదేశంతో ఫర్హీన్ కు అడ్మిషన్

ఇంటర్నేషనల్ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే NEET లో 66వ ర్యాంకు పొందిన ఓ విద్యార్థినికి సీటు నిరాకరించిన ఎయిమ్స్ ఆపై తన తప్పును ఒప్పుకుంది. కేరళకు చెందిన కేఎస్ ఫర్హీన్ అనే విద్యార్థిని NEET-2020లో మెరుగైన ర్యాంకు సాధించి టాప్-100లో నిలిచింది.  నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె వైద్య విద్య కోసం ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS ) లో దరఖాస్తు చేసుకుంది.

అయితే గడువు లోపల క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో ఎయిమ్స్ యాజమాన్యం సీటు నిరాకరించింది. దాంతో ఆమె బీజేపీ ఎంపీ ఆల్ఫోన్స్ ను కలిసి తన పరిస్థితి వివరించింది. ఎంపీ ఆల్ఫోన్స్ ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రి వెంటనే స్పందించి ఎయిమ్స్ ను ఆదేశించారు. మెరుగైన ర్యాంకర్ కు సీటు ఇవ్వకపోవడాన్ని తమ తప్పిదంగా భావించిన ఎయిమ్స్ యాజమాన్యం వెంటనే ఫర్హీన్ కు వైద్య విద్యలో అడ్మిషన్ ఇచ్చింది.

Latest Updates