‘గాంధీ’లో నేడు దిశ నిందితుల డెడ్ బాడీలకు రీ పోస్ట్ మార్టం

హైదరాబాద్, వెలుగు: దిశ కేసు నిందితుల డెడ్ బాడీలకు రీ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డాక్టర్ల టీం ఆదివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంది. సోమవారం ఉదయం ఎయిమ్స్ డాక్టర్లు గాంధీ హాస్పిటల్ కు రానున్నారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు ఉదయం 9 గంటలకు రీ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఒక్కో డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టం చేసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టవచ్చని చెప్తున్నారు. దీంతో నాలగు మృతదేహాలకూ రీ పోస్ట్ మార్టం సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగే అవకాశం ఉంది.

 

Latest Updates