లోక్ సభ బరిలో..  తొలిసారి మహారాష్ట్ర నుంచి మజ్లిస్ పోటీ

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎమ్ఐఎమ్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇందుకుగాను.. ఔరంగాబాద్ సెంట్రల్ స్థానాన్ని ఎంచుకుంది. ఇక్కడి నుంచి ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే ఇంతియాజ్ పోటీచేస్తున్నారు. ఇప్పటివరకు లోక్ సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయలేదు. అయితే..  ఈ సారి మాత్రం.. మహారాష్ట్ర లోని రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్న ఎమ్ఐఎమ్ ఒక స్థానంలోనే బరిలో ఉంది. ముందునుంచి ముంభై నార్త్ సెంట్రల్, లేదా.. ముంభై నార్త్ వెస్ట్ లోక్ సభ స్థానాల్లో పోటీచేయాలని  ప్లాన్ చేశారు. కాని కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

Latest Updates