ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..టేకాఫ్ అయిన నిమిషాల్లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..టేకాఫ్ అయిన నిమిషాల్లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్

గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమదం తర్వాత విమానాలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. విమానాల్లో తరుచుగా ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ లు ప్రయాణికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఘటన తర్వాత టెక్నికల్ ఇష్యూష్ తో చాలా విమానాలు ల్యాండింగ్ అయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా  శనివారం (జూలై 19) ఉదయం   హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ లోని ఫుకెట్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే  తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండిం గ్ చేశారు.  

హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ లోని పుకెట్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. శనివారం ఉదయం 6.20గంటలకు  షెడ్యూల్ టైం కంటే 20 నిమిషాల ముందే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ నం. IX110  బోయింగ్ 737 మ్యాక్స్ 87 విమానం ఫుకెట్ కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి  విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్  చేశారు. అయితే అత్యవసర ల్యాండింగ్ కు కారణాలను ఇప్పటివరకు వెళ్లడించలేదు ఎయిర్ పోర్టు అధికారులు.