ప్రయాణికులకు చుక్కలు చూపించిన విమానం

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. మస్కట్‌ నుంచి కాలికట్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం ఆకాశంలో ఉండగానే ఒక్కసారిగా పీడనం తగ్గిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. విమానంలో పీడనం తగ్గడంతో నలుగురు ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం కారగా, మరికొందరు చెపి నొప్పితో ఇబ్బంది పడ్డారు.

ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 737-8 రకానికి చెందిన IX – 350 విమానంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రయాణికులు అస్వస్థతకు గురవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని మస్కట్‌ ఎయిర్‌ పోర్టుకు మళ్లించారు. ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ లో ట్రీట్ మెంట్ అందించారు. ప్యాసింజర్లు కోలుకున్న తర్వాత విమానం కాలికట్‌ బయల్దేరింది. క్యాబిన్‌ లో పీడన సమస్య ఏర్పడటంతో ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు ఎయిర్‌ఇండియా అధికారులు.

 

Latest Updates