ఎయిర్ ఇండియా విమానంపై గాంధీ బొమ్మ…

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించింది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. తన ఫ్లాగ్ షిప్ క్యారియర్ అయిన ఎయిర్ బస్ A320 ఎయిర్ క్రాఫ్ట్ తోక భాగంలో గాంధీ బొమ్మను పెయింట్ చేసింది. గాంధీ మెసేజ్ లను ప్రపంచమంతా పంపడమే లక్ష్యంగా ఎయిర్ బస్ పై గాంధీ బొమ్మలను వేసినట్టు చెప్పారు ఎయిర్ ఇండియా CMD అశ్వనీ లొహానీ. ఇలా చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇకపై ప్రతీ మోడల్ లోని ఒక్కో విమానంపై గాంధీ బొమ్మను ముద్రిస్తామన్నారు లొహానీ.

Latest Updates