హాంకాంగ్ కు ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిపివేత

చైనా దేశ వ్యాప్తంగా కోరానా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. చైనాతో పాటు  ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.దీంతో  చైనాకు ఇతర దేశాల ప్రయాణికుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి.

ఇప్పటికే పలు విమానయాన సంస్థలు చైనా, దాని పొరుగున ఉన్న తైవాన్, హాంకాంగ్ లకు విమానసర్వీసులను తగ్గించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా హాంకాంగ్ కు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 8 నుంచి హాంకాంగ్ కు విమానాలు నడపరాదని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 7న నడిపే AI314 సర్వీసే హాంకాంగ్ కు ఎయిరిండియా నడిపే చివరి సర్వీసు కానుంది.

Latest Updates