ఈ నెల 11 నుంచి ఇండియా- అమెరికా మ‌ధ్య విమాన స‌ర్వీసులు

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ‘వందే భారత్ మిషన్’ కింద ఇండియా-యుఎస్ఏ మధ్య 36 విమానాలను నడుపనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జూలై 11 నుంచి జూలై 19 వరకూ విమానాల ఆపరేషన్ ఉంటుందని తెలిపింది. ప్ర‌యాణానికి సంబంధించిన‌ టికెట్లను సోమవారం (జులై 6) నుంచి ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని పేర్కొంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 6వ తేదీ రాత్రి 8 గంటల నుంచి టికెట్ల బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా వివరించింది.

Latest Updates