ఢిల్లీలో డీజిల్ జనరేటర్లు బ్యాన్

దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ అమాంతం పెరిగిపోతోంది. బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఘోరంగా తగ్గిపోయింది. కొద్ది రోజులుగా దుమ్ము, పొగతో నిండిన గాలి ఢిల్లీని కమ్మేస్తోంది. ప్రతి ఏటా చలికాలం ఈ పరిస్థితిని ఢిల్లీ కామన్‌గా ఫేస్ చేస్తోంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు వాహనాలపై కంట్రోల్ విధించడం లాంటి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది ఢిల్లీ సర్కారు. అయితే ఈ ఏడాది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) కొత్త నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కరెంటు పోయినప్పుడు వాడే జనరేట్లపై బ్యాన్ విధించింది. పొల్యూషన్ లెవల్స్‌ని కట్టడి చేసేందుకు డీజిల్, కిరోసిన్, పెట్రోల్ లాంటివాటితో నడిచే జనరేట్ల వాడకాన్ని గురువారం (అక్టోబర్ 15) నుంచి నిషేధించింది. తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని DPCC తెలిపింది. అయితే అన్ని అత్యవసర సర్వీసులకు వీటి వాడకాన్ని కొనసాగించవచ్చని చెప్పింది. ఆస్పత్రులు, ఇతర హెల్త్ కేర్ సంస్థలు, ఢిల్లీ మెట్రో, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్, బస్టాండ్లు, నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ ఆఫీసులు, లిఫ్ట్‌ల వాడకానికి జనరేట్లపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ చైర్‌పర్సన్ సిటీలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలను విజిట్ చేసి నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో అత్యవసరంగా DPCC ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే డంపింగ్ యార్డుల్లో చెత్త తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్లపై దుమ్మురేగకుండా వీలైనంత వరకూ ప్రతి రోజూ క్లీన్ చేయాలని, లేదంటే కనీసం రోడ్లపై నీళ్లు చల్లి దుమ్ము లేవకుండా చూడాలని కమిటీ ఆదేశించింది.

Latest Updates