ఎయిర్ ఆసియా విస్తరణకు రెడీ

ఎయిర్‌ ఏసియా దగ్గర తగిన స్థాయిలో నిధులు ఉన్నాయని, కార్యకలాపాల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అంకుర్‌ గార్గ్‌ ఏజెంట్లకు తెలిపారు. ఎయిర్‌ ఏసియా భారత్‌ నుంచి తప్పుకోనుందనే వార్తలను కూడా కంపెనీ కొట్టిపారేసింది. ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని గార్గ్‌  చెప్పింది. విస్తార నెట్‌వర్క్‌తో ఉన్న తాము భారత్‌లో సేవలు అందించేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్లను మరింత పెంచుతామని… విమానయాన రంగాన్ని  కరొనా వైరస్ తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇందుకు ఎయిర్‌ ఏసియా ఏమాత్రం మినహాయింపు కాదన్నారు. తగిన నిధులతోనే ఉన్నామని… అవసరమైన సమయంలో ఫండింగ్‌కు మా షేర్‌ హోల్డర్లు రెడీగా ఉన్నారని ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు గార్గ్‌ లేఖ రాశారు. భారత్‌లో పెట్టుబడులపై సమీక్ష నిర్వహిస్తామని సంస్థకు చెందిన మలేసియా ప్రమోటర్లు ప్రకటించారు.

Latest Updates