కూలిన ఎయిర్ ఫోర్స్ మిగ్ 21 ఫైటర్ : పైలట్ సేఫ్

బికనీర్ : రాజస్థాన్ లోని బికనీర్ లో ఎయిర్ ఫోర్స్ కు చెందిన MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. పారాచూట్ సాయంతో పైలట్ కిందకు దిగినట్టు వివరించారు. బికనీర్ దగ్గర్లోని శోభాసార్ గ్రామం దగ్గర ఈ సంఘటన జరిగింది. దీనివెనుక ఏ కారణాలు లేవనీ.. రొటీన్ మిషన్ లో భాగంగా గాల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తూ క్రాష్ అయినట్టు అధికారులు చెప్పారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

Latest Updates