కరోనా ఎఫెక్ట్.. ఎయిర్‌‌‌‌లైన్స్​ కొత్త ఆఫర్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:   కరోనా వైరస్‌‌ దెబ్బతో గ్లోబల్‌‌ టూరిజం అతలాకుతలం అవుతోంది. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌‌ భయంతో చాలా దేశాలు విదేశీ పర్యాటకులపై ఆంక్షలు విధించాయి.  ప్రజలు కూడా ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎయిర్‌‌‌‌లైన్స్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ సర్వీసులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇంటర్నేషనల్‌‌, డొమెస్టిక్‌‌ బుకింగ్స్‌‌ డేట్స్‌‌ను రీషెడ్యూల్‌‌ చేసుకుంటే ఛార్జీలను విధించడంలేదు. ఇప్పటికే ఇండిగో, ఎయిర్‌‌‌‌ఏసియా, స్పైస్‌‌జెట్‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌, గో ఎయిర్‌‌‌‌లు ఈ ఆఫర్‌‌‌‌ను అందిస్తుండగా, తాజాగా ఎయిర్‌‌‌‌ ఇండియా, ఎయిర్‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌లు కూడా ఈ ఆఫర్‌‌‌‌ను ప్రకటించాయి. ఈ నెల 12 నుంచి 31 మధ్య ఇప్పటికే చేసుకున్న బుకింగ్స్‌‌ కానీ, కొత్త బుకింగ్స్‌‌ను కానీ రీషెడ్యూల్ చేసుకుంటే ఎటువంటి ఛార్జీలను వసూలు చేయమని ఇండిగో ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ ఈ నెల 7న ప్రకటించింది. అంతేకాకుండా క్యాన్సిలేషన్‌‌ ఛార్జీలు కూడా ఉండవని తెలిపింది.

ఈ ఎయిర్‌‌‌‌లైన్‌‌ తర్వాత(మార్చి 08) ఎయిర్‌‌‌‌ఏసియా ఇండియా కూడా ఈ డేట్స్‌‌ మధ్యనే జరిగిన బుకింగ్స్‌‌ రీషెడ్యుల్‌‌పై ఎటువంటి ఛార్జీలను విధించమని ప్రకటించింది. ఇది కేవలం మొదటి రీషెడ్యూల్‌‌కే వర్తిస్తుందని, అది కూడా షెడ్యూల్‌‌ డేట్‌‌కు మూడు రోజుల ముందే జరగాలని తెలిపింది. స్పైస్‌‌ జెట్‌‌ కూడా సోమవారం 12–31 మధ్య ఇప్పటికే జరిగిన బుకింగ్స్‌‌ను రీషెడ్యూల్‌‌ చేసుకుంటే ఎటువంటి ఛార్జీలను విధించమని ప్రకటించింది.  గోఎయిర్‌‌‌‌ అయితే ఏకంగా మార్చి 8 నుంచి ఏప్రిల్‌‌ 30 మధ్య బుక్‌‌ అయిన టికెట్స్‌‌ను రీషెడ్యూల్‌‌ చేసుకున్నా, క్యాన్సిల్‌‌ చేసుకున్నా ఎటువంటి ఛార్జీలను విధించమని ప్రకటించింది. ఈ రీషెడ్యూల్‌‌ డేట్‌‌ మార్చి 8 నుంచి సెప్టెంబర్‌‌‌‌ 30 మధ్యలో ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా బుకింగ్‌‌ డేట్‌‌కు  14 రోజుల ముందు రీషెడ్యూల్‌‌ లేదా క్యాన్సిల్​ అయితేనే ఆఫర్​ వర్తిస్తుంది.

ఎయిర్‌‌‌‌ ఇండియా  కూడా..

ఎయిర్‌‌‌‌ ఇండియా కూడా 30 ఏప్రిల్‌‌, 2020 లోపు ఇప్పటికే జరిగిన బుకింగ్స్‌‌ను రీషెడ్యూల్‌‌ చేసుకున్నా, లేదా క్యాన్సిల్‌‌ చేసుకున్నా ఎటువంటి ఛార్జీని వసూలు చేయమని సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఆఫర్‌‌‌‌ కింద మార్చి 31 లోపు జరిగే కొత్త బుకింగ్స్‌‌ రీషెడ్యూల్‌‌ చేసుకోవచ్చు. ఒక బుకింగ్‌‌కు  ఒక రీషెడ్యూల్‌‌కే ఛార్జీలను వసూల్‌‌ చేయరు.రీ షెడ్యూల్‌‌ చేసినప్పుడు ధరలో మార్పు ఉంటే అది కస్టమర్లే భరించాలి.  ఎయిర్‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ కూడా మార్చి 12–31 మధ్య ఇప్పటికే ఉన్న బుకింగ్స్‌‌ కానీ, కొత్త బుకింగ్స్‌‌ను కానీ రీషెడ్యూల్‌‌ చేసుకుంటే ఎటువంటి ఛార్జీని విధించమని ప్రకటించింది.

Latest Updates