జూన్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభం

లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందింస్తోంది. వచ్చేనెల(జూన్) నుంచి విదేశాలకు విమాన సేవలు మళ్లీ ప్రారంభించే అవకాశముందని విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాలను పాటిస్తూ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించనున్నారు. లాక్‌డౌన్‌తో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం మొదట ఎయిర్ ఇండియా, ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది.

Latest Updates