విమానాల్లో మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచండి

విమానయాన సంస్థలను కోరిన డీజీసీఏ
న్యూఢిల్లీ: కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న టైమ్ లో సోషల్ డిస్టెన్సింగ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మహమ్మారితో జాగ్రత్తగా ఉండే చర్యల్లో భాగంగా విమానాల్లో మిడిల్ సీట్స్ ను ఖాళీగా ఉంచాలని విమానయనా సంస్థలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కోరింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కరోనా నుంచి సేఫ్టీ కోసం చుట్టుకునేందుకు వ్ర్యాప్ అరౌండ్ లు ఇవ్వాలని తెలిపింది.

‘మధ్యలోని సీట్లను ఖాళీగా ఉంచేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నించండి. ఒకవేళ హై లోడ్ తో మిడిల్ సీట్స్ ఆక్యుపై అయితే ప్రయాణికులకు సేఫ్టీ కోసం వ్ర్యాప్ అరౌండ్ లు ఇవ్వండి’ అని విమానయాన సంస్థలను డీజీసీఏ కోరింది. గత నెల 25వ తేదీ నుంచి ఫ్లైట్స్ సేవలను ప్రభుత్వం తిరిగి ఆరంభించిన సంగతి తెలిసిందే.

Latest Updates