అఖిలేష్ ను ఫ్లైట్ ఎక్కనివ్వలేదు

లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్. ఓ కార్యక్రమం కోసం అలహాబాద్‌ వెళ్తున్న ఆయనను మంగళవారం లక్నో ఎయిర్‌ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. విమానం వెళ్లిపోయిన తర్వాత ఆయనను బయటకు పంపించారు. దీంతో సీరియస్ అయిన అఖిలేష్ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. “ఎలాంటి కారణం లేకుండా ఎయిర్‌ పోర్టు సిబ్బంది తనను అడ్డుకున్నారు. అలహాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న తనను పోలీసులు బంధించారు” అని ట్విటర్‌ లో పోస్ట్ చేశారు. అఖిలేష్ ను అడ్డుకోవడంతో ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అఖిలేష్‌ యాదవ్‌ పట్ల లక్నో అధికారులు వ్యవహరించిన తీరును ఖండించారు BSP అధినేత్రి మాయావతి. NDA ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయిందని.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ట్వీట్ చేశారు మాయావతి.

Latest Updates