ఎయిర్ టెల్ మరో బంపర్ ప్లాన్

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ మరో అద్భుతమైన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.299తో ఈ బంపర్ ఆఫర్‌లో అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, రోజుకు 2.5GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఇలాంటి ఆఫర్ ప్రకటించడం టెలికం రంగంలోనే ఫస్ట్ టైమ్ అని తెలిపింది ఎయిర్ టెల్. వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్లలోనూ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉన్నట్టు తెలిపింది ఎయిర్ టెల్.

Latest Updates