సెక్రటేరియట్ దగ్గర AISF, AIYF నిరసన

సెక్రటేరియట్ : ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో AISF, AIYF సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించాయి. పేపర్ల వాల్యుయేషన్ లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

దళితుడైన డిప్యూటీ సీఎం రాజయ్యపై ఆరోపణలు వస్తే మంత్రి పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం.. 17 మంది విద్యార్థులు చనిపోతే మంత్రి జగదీష్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరినాపైనా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో సెక్రటేరియట్ వద్ద పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 మంది విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Updates