ఐశ్వర్య రాయ్, ఆరాధ్యకు కరోనా నెగిటివ్..ఆస్ప‌త్రిలోనే బిగ్ బి

ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగిటివ్ వ‌చ్చిందంటూ బాలీవుడ్ హీరో అబిషేక్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు. జులై 12న అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా ల‌క్షణాలు ఉండ‌డంతో వైద్యులు టెస్ట్ లు చేశారు. ఆ టెస్ట్ ల్లో అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్ ఆమె కుమార్తె ఆరాద్య‌కు క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింది. దీంతో అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ముంబై లీలావతి ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యారు
అయితే వారిలో ఐశ్వ‌ర్యారాయ్, ఆరాద్య‌కు క‌రోనా టెస్ట్ ల్లో నెగిటీవ్ వ‌చ్చిందంటూ అభిషేక్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం తాను, త‌న తండ్రి అమితాబ్ బ‌చ్చ‌న్ ఆస్ప‌త్రిలో ఉన్నామని.. మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలోనే ఉండాలని సూచించినట్లు అభిషేక్ ట్వీట్ చేశాడు. . లీలావతి హాస్పిటల్ నుంచి ఐశ్వర్య, ఆరాధ్య ఇద్దరూ డిశ్చార్జ్ కావడంతో అభిమానులు సంతోష పడుతున్నారు. అమితాబ్, అభిషేక్ కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు

Latest Updates