మిజోరాంలోని ఐజౌల్ నగరం దేశానికే ఆదర్శం

ఐజౌల్.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరాంకి రాజధాని. పరిశుభ్రత విషయంలో మాత్రం టోటల్ ఇండియాకే క్యాపిటల్. ఇంత గొప్ప పేరు రావటానికి ఐజౌల్ మునిసి పాలిటీ కార్పొరేషన్ (ఏఎంసీ)విధానాలు , చర్యలే ప్రధాన కారణం. మునిసిపల్ కమిషర్ మొదలుకొని శానిటేషన్ వర్కర్ వరకు ప్రతి ఒక్కరూ ఇగోలకు పోకుండా అంతా సమానమనే ఆలోచనతో సాగుతున్నారు. యూనిఫాం ఉంటే తప్ప ఆఫీసర్ ఎవరో, కార్మికుడు ఎవరో గుర్తించటం కష్టం అన్నంతగా కలిసి మెలిసి ఉంటారు. వర్కర్లు ఫీల్డ్ లోనే యూనిఫాం వేసుకుంటారు. ఆఫీసుకు చేరుకున్న తర్వాత సివిల్ డ్రెస్ లోనే డ్యూటీ చేస్తారు. స్వీపర్లను, శానిటేషన్ వర్కర్లను కేవలం ఆ పనులకే కేటాయించరు. అవసరాన్ని బట్టి ప్యూన్ గా, ఆఫీస్ అసిస్టెంట్‌ గా నియమిస్తారు. ఫోర్త్​ గ్రేడ్ గవర్నమెంట్​ ఎంప్లాయ్ గా గుర్తిస్తారు. నగర పాలక సంస్థల్లో ఇంత చక్కని పని వాతావరణం ఐజౌల్ లో తప్ప మరెక్కడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. సహజంగా శానిటేషన్ వర్క్​ను ఫలానా కులంవాళ్లతోనే, ఫలానా జాతివాళ్లతోనే చేయించాలనే అభిప్రాయం దేశ వ్యాప్తంగా నెలకొన్న మాట వాస్తవం. ఐజౌల్ లో దీనికి భిన్నంగా వ్యవహరిస్తుండటం స్వాగతించాల్సిన పరిణామం. మిజో సొసైటీలో అసలు కులాల ప్రస్తావనే ఉండదు. నగరంలోని కొంతమంది స్వీపర్లు చర్చిల్లోని సండే స్కూల్ ప్రోగ్రామ్స్​లో టీచర్లుగా మారి వివిధ సబ్జెక్టుల్ని బోధిస్తుండటం మరింత ఆసక్తికరం.

ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్చ ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వల్లే సాధ్యం

మనుషులంతా ఒకటే అనే భావన మిజో ప్రజల జీవితాల్లో క్రిస్టియానిటీ ప్రవేశించక ముందు నుంచే ఉంది. ఈ విలువలను ట్రైబల్ కల్చరే నేర్పింది. కమ్యూనిటీ చిన్నది కావటంతో మెజారిటీ పీపుల్ మధ్య​ రిలేషన్స్​ సహజంగానే నెలకొన్నాయి. కలిసి జీవించటం, పెళ్లిళ్లు, ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కరిమధ్య ఏదో ఒక బంధుత్వం ఏర్పడింది. భాష కూడా ఒకటే కావటమూ దీనికి ఒక కారణమే. పేదోళ్లు, సంపన్నులు అనే తేడా లేదు. అందరిదీ ఒకటే మాట, ఒకటే బాట. పండుగలు, సంప్రదాయాలు, బాగోగులు అందరివీ ఒకటే. అందువల్ల మిజో ప్రజలంతా ఒక హోమోజీనియస్ సొసైటీలా జీవిస్తున్నారు . ఈ సొసైటీలోని అందరినీ ఒకటిగా ఉంచటానికి యంగ్ మిజో అసోసియేషన్లు (వైఎంఏ) కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మిజోరాం లో ఎఫెక్టివ్ గా పనిచేసే సింగిల్ మోస్ట్​ సోషియో–రెలీజియస్ బాడీ ఐఎంఏ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘాల్లో దాదా పు 4.5 లక్షల మందిసభ్యులుగా ఉన్నారు.

హెల్త్​, శానిటేషన్ , న్యూట్రిషన్ కమిటీలను స్థానిక మునిపిపాలిటీలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు మానిటర్చేస్తుంటాయి. డిఫాల్టర్లను గుర్తించడానికి సీసీటీవీ కెమెరాల సాయం తీసుకుంటారు. సిటీలో క్లీన్లీ నెస్ పర్యవేక్షణకు ఏఎంసీ వివిధ ప్రాంతాల్లో 30 సీసీటీవీలను ఏర్పాటు చేసింది. తడి, పొడి చెత్త నిర్వహణకు పది కాలనీలు కలిసి వేస్ట్​మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెం ట్‌ కోసం 2009లోపైలట్​​ ప్రాజెక్ట్​ని చేపట్టి విజయం సాధిం చాయి. రోజువిడిచి రోజు చెత్త సేకరణకు 50 పికప్ వ్యాన్లను అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికీ డస్ట్​ బిన్ లు సప్లైచేశారు. దేశంలో అత్యంత వేగంగా నగరీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో మిజోరాం ఒకటి. దీంతో అక్కడ వెలువడుతున్న చెత్త పరిమాణం ఏటేటా పెరుగుతోంది. ఫలితంగా డంపింగ్ యార్డ్ ల సంఖ్యను పెంచాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం అమలుచేస్తున్న స్మార్ట్​ సిటీ ప్రాజెక్టులో ఐజౌల్ ని కూడా సెలెక్ట్​ చేశారు. ఈనేపథ్యం లో నగరాన్ని మరింత శుభ్రంగా, అందంగా తీర్చిద్దాల్సిన బాధ్యత ఏఎంసీపై ఉంది. శానిటేషన్ వర్కర్లు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటే వాళ్ల పని గంటలకు తగ్గట్లు శాలరీలు పెంచాలి.

Latest Updates