‘ఆర్ఆర్ఆర్’ లో భగత్ సింగ్ గా అజయ్ దేవగన్

నిజ జీవితంలో జరగుతాయని ఊహించడానికే ఆశ్చర్యమేసే అసాధ్యాలు, అధ్బుతాలు సినిమాల్లో సునాయాసంగా జరుగుతుంటాయి. ఫిల్మ్ మేకర్స్ ఊహాశక్తికి, ప్రతిభకి అదే నిదర్శనం. ‘బాహుబలి’తో అలాంటి ఓ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి.. ఇప్పుడు మరో వండర్ క్రియేట్ చేసే దిశగా ‘ఆర్ఆర్ఆర్’ తీస్తున్నాడు. మన్యం అడవుల్లోని అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్‌‌ అడవుల్లోని కొమురం భీమ్ కలిస్తే ఎలా ఉండబోతోందనే ఫిక్షన్‌‌ స్టోరీని సిల్వర్ స్క్రీన్‌‌పై ఆవిష్కరించబోతున్నాడు జక్కన్న. అయితే ఈ ఇద్దరు దక్షిణాది విప్లవ వీరులతో పాటు ఒక ఉత్తరాది విప్లవ వీరుడు కూడా కనిపించబోతున్నాడట. ఆ పాత్రని అజయ్‌‌ దేవగన్‌‌ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్ర మరేదో కాదు.. భగత్‌‌ సింగ్‌‌. నిడివి తక్కువే అయినప్పటికీ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఈ క్యారెక్టర్‌‌‌‌ని డిజైన్ చేశాడట రాజమౌళి. ఇటీవల తాను అజయ్ దేవగన్‌‌కి జంటగా నటించబోతున్నట్టు, ప్లాష్‌‌ బ్యాక్‌‌ సీన్స్‌‌లో కనిపించనున్నట్టు శ్రియ చెప్పింది. అవి అజయ్ పోషిస్తున్న భగత్‌‌ సింగ్‌‌ పాత్ర ప్లాష్ బ్యాక్ సీన్స్‌‌ అని అర్థమవుతోంది. భగత్ సింగ్‌‌గా కనిపించడం అజయ్‌‌కి కొత్తేమీ కాదు. గతంలో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’లో అద్భుతంగా నటించి నేషనల్‌‌ అవార్డును అందుకున్నాడు. అందుకే ఆయన్ని తీసుకున్నారు తప్ప అందరూ అనుకుంటున్నట్టు కేవలం బాలీవుడ్ మార్కెట్ కోసం కాదని తెలుస్తోంది.

For More News..

ఏ దేశానిదో చెప్పడానికి కాస్త సమయం ఇవ్వండి

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

Latest Updates