50లక్షల విరాళం: నా సినిమాను పాకిస్తాన్ లో రిలీజ్ చేయను

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘టోటల్ ధమాల్’. పుల్వమా దాడికి నిరసనగా తన సినిమాను పాకిస్తాన్ లో రిలీజ్ చేయనని అన్నారు అజయ్. తమ సినిమా టీం తరపున 50 లక్షల విరాళాన్ని అమర జవాన్ల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

పుల్వామా ఘటన లో 40 మంది అమరులవగా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన సినిమా పాకిస్తాన్ లో విడుదల చేయకూడదన్న అజయ్ నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దేశం కంటే ఏదీ ఎక్కువకాదని అందుకు అజయ్ ఒక ఉదాహరణ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 22న విడుదల అవనున్న ఈ సినిమాకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించారు.

Latest Updates