అజయ్‌ దేవగణ్‌ తండ్రి కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ తండ్రి… వీరు దేవగణ్‌ కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యతో ముంబైలోని సూర్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సోమవారం) తుదిశ్వాస విడిచారు. విలే పార్లే వెస్ట్ శ్మశానవాటికలో వీరు అంత్యక్రియలు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.

వీరూ దేవగణ్‌ 80 హిందీ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. బాలీవుడ్‌లో యాక్షన్‌ సన్నివేశాల కోసం తొలిసారి రోప్‌  వాడిన కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగణ్‌. అంతేకాదు ఆయన ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1999లో వచ్చిన ‘హిందుస్థాన్ కి కసమ్’ సినిమాకు వీరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయన కుమారుడు అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించారు. వీరూ దేవగణ్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Latest Updates