క్రికెటర్‌ రహానేకు తండ్రిగా ప్రమోషన్

టీమిండియా క్రికెటర్‌కు తండ్రిగా ప్రమోషన్‌ వచ్చింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఉన్న అజింక్యా రహానె తండ్రి అయ్యాడు. అతని భార్య రాధికా ధోపావ్‌కర్‌ ఇవాళ(శనివారం) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రహానే దంపతులకు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు.

తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికను ఐదేళ్ల క్రితం రహానే మ్యారేజ్ చేసుకున్నాడు.

Latest Updates