టీమిండియా సెలెక్టర్‌‌ రేసులో…

న్యూఢిల్లీ: టీమిండియా సెలెక్టర్లకు పోటీ బాగానే పెరిగింది. ఖాళీగా ఉన్న మూడు పోస్ట్‌‌ల కోసం మాజీ పేసర్లు అజిత్‌‌ అగార్కర్‌‌, చేతన్‌‌ శర్మతో పాటు మాజీ స్పిన్నర్‌‌ మణిందర్‌‌ సింగ్‌‌, ఓపెనర్​ శివసుందర్‌‌ దాస్‌‌ స్ట్రాంగ్‌‌ క్యాండిడేట్స్‌‌గా రేస్‌‌లో ముందున్నారు. సెలెక్టర్ల ఎంపిక విషయంలో బీసీసీఐ జోనల్‌‌ పాలసీకి కట్టుబడుతుందా? లేక కొత్త రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్తుందా? అన్నది తేలాల్సి ఉంది. గతేడాది సునీల్‌‌ జోషి, హర్విందర్‌‌ సింగ్‌‌ను జోనల్‌‌ ప్రకారమే తీసుకున్నారు. అయితే కొత్త రాజ్యాంగం ప్రకారం ది బెస్ట్‌‌ ఫైవ్‌‌ను ఎంచుకునే చాన్స్‌‌ ఉంది. అందుకే అప్లికేషన్స్‌‌లో ఎక్కడా జోనల్‌‌ ప్రస్తావనను తీసుకురాలేదు. మరోవైపు గతంలో అప్లై చేసిన అగార్కర్‌‌, మణిందర్‌‌ రీ అప్లై చేయడంపై కూడా బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీళ్లిద్దరూ మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని లాక్‌‌డౌన్‌‌కు ముందు బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ కొంత క్లారిటీ ఇచ్చాడు. దీంతో అగార్కర్‌‌, మణిందర్‌‌ రేస్‌‌లో ముందుకొచ్చారు. ఇంటర్నేషనల్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ నేపథ్యంలో అగార్కర్‌‌.. సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ పదవికి ఫేవరెట్‌‌గా కనిపిస్తున్నాడు. మొత్తానికి జోనల్‌‌ ఇష్యూ తేలితే ఫుల్‌‌ క్లారిటీ వస్తుంది. బెంగాల్‌‌ (ఈస్ట్‌‌ జోన్‌‌) నుంచి మాజీ పేసర్‌‌ రణ్‌‌దీప్‌‌ బోస్‌‌, చేతన్‌‌ శర్మ.. అప్లై చేయడంతో గందరగోళం  మొదలైంది.

 

Latest Updates