సెక్యూరిటీని కట్టుదిట్టం చేయండి: అజిత్ దోవల్

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ లో భద్రతా పరిస్థితులపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పూర్తి కార్యాచరణ సమీక్ష నిర్వహించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ తోపాటు కశ్మీర్ లోయలో చొరబాట్లు జరగకుండా కౌంటర్ ఇన్ ఫిల్ ట్రేషన్ గ్రిడ్ ను కఠినతరం చేయాలని టాప్ కమాండర్లు, పారామిలిటరీ ఫోర్సెస్ కు ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బలమైన సైనిక కార్యకలాపాలు కలిగిన నార్త్ కశ్మీర్ లోని హంద్వారా, బారాముల్లా, సోపోర్ ల్లో ఆరుగురు జవాన్లతో పాటు కల్నర్ ర్యాంక్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడంపై చర్చ జరిగింది. టాప్ లష్కర్ కమాండర్ హైదర్ ను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టడంపైనా అలాగే ఇండియా వెస్టర్న్ బార్డర్ మీదుగా పాక్ స్తాన్ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలపైనా ప్రస్తావించారు.

అజిత్ ధోవల్ నిర్వహించిన మీటింగ్ లో ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి చొరబడటానికి ఉపయోగించిన మార్గాలు, టెర్రరిస్టులను గుర్తించడానికి సాయపడే ట్వీక్స్ పై విస్తృతస్థాయిలో చర్చించారని ఓ సీనియర్ కౌంటర్ టెర్రరిస్టు అధికారి నేషనల్ మీడియాకు తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని దధునల్, షర్దా, అత్ముకం నుంచి ఎల్ వోసీ గుండా యాక్టివేట్ అయిన టెర్రర్ లాంచ్ ప్యాడ్ల నుంచి బోర్డర్ గార్డింగ్ ఫోర్సెస్ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. చొరబాట్లు జరిగే టైమ్ లో భద్రతా దళాలను ఏమార్చడానికి పాక్ తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడాన్ని తరచూ గమనిస్తున్నాం అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెపారు. కశ్మీర్ లోయలో టెర్రరిస్టుల ఉనికిని పెంచేందుకు వచ్చే రెండు నెలల్లో జైషే మహ్మద్ నుంచి లష్కర్ ఏ తొయిబా వరకు వివిధ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ ల్లో నుంచి దాదాపు 400 మంది ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని భద్రతా దళాలకు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది.

Latest Updates