నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టారు: మాజీ సీఎం

ఛత్తీస్ గడ్  మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోఘి తన కుమారుడు అమిత్ జోఘి అరెస్ట్ పై స్పందించారు. తన కొడుకుపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిందంటూ ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ భగాల్ పై మండిపడ్డారు.  అమిత్ జోఘిపై వచ్చిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని మూడు నెలల క్రితమే ఛత్తీస్ గఢ్ హైకోర్టు తెలిపిందని, అది తెలిసి కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయడం అన్యాయమంటూ దుయ్యబట్టారు. అధికారం మత్తులో సీఎం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడని అజిత్ జోఘి ఆరోపించారు.

2013 లో జరిగిన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగం క్రింద అజిత్ పై కేసు నమోదైంది. అమిత్ 1977లో టెక్సాస్ లో పుట్టాడని.., అఫిడవిట్ లో మాత్రం ఛత్తీస్ గడ్ లోని గౌరెలా గ్రామంలో పుట్టినట్టు సమాచారమిచ్చాడని సమీరా షైక్రా అనే బీజేపీ కార్యకర్త  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest Updates