‘మహా‘ మలుపులు.!. బీజీపీకి ఎన్సీపీ మద్దతు లేదన్న శరద్ పవార్

మహా రాష్ట్ర రాజకీయాల్లో మహా మలుపులు జరుగుతున్నాయి.  బీజేపీకి మద్దతివ్వడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం ఎన్సీపీది కాదంటూ ట్వీట్ చేశారు.  ఆయన నిర్ణయానికి తన మద్దతు లేదన్నారు. బీజేపీకి మద్దతివ్వాలన్నది తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. అజిత్ పవార్ నిర్ణయంతో ఎన్సీపీకి సంబంధం లేదన్నారు.

మరో వైపు శివసేన ఎంపీ అజిత్ పవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ శరద్ పవార్ ను, మహారాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. అజిత్ పవార్ నిర్ణయంతో శరద్ పవార్ కు సంబంధం లేదన్నారు. ఈడీ ద్వారా అజిత్ పవార్ ను బీజేపీ భయపెట్టిందన్నారు. నిన్న తమతో జరిగిన సమావేశంలో అజిత్ వింతగా ప్రవర్తించారని అన్నారు. శరద్ పవార్,ఉద్ధవ్ థాక్రే సమావేశం కానున్నారని అన్నారు.

Latest Updates