4500కి.మీ.. బైక్ పై హీరో అజిత్ సిక్కిం ట్రిప్

త‌మిళ హీరో అజిత్ కు సంబంధించిన పిక్ ఒక‌టి నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో త‌న త‌మిళ చిత్రం ‘వాలిమై’ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న అజిత్..  తన బీఎండబ్ల్యూ బైక్ పై సిక్కిం కు టూర్ ప్లాన్ వేశాడు. ఈ రోడ్ ట్రిప్ పై ఆల్రెడీ వారణాసి వరకు వెళ్లిపోయాడు. అక్కడ ఓ అభిమానితో అజిత్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారణాసి నుంచి సిక్కిం వెళ్తున్న అజిత్.. అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని.. తిరిగి చెన్నై చేరుకుంటాడు. ఇలా ఈ ట్రిప్ లో 4500 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డ్ సృష్టించబోతున్నాడు అజిత్ . ప్ర‌స్తుతం ఆయన న‌టిస్తున్న‌ చిత్రం ‘వాలిమై’ కు వినోద్ ద‌ర్శ‌కుడు.  హ్యూమా ఖురేషి ప్రధానపాత్రలో నటిస్తోంది.

Latest Updates