AK-47తో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

లరఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా ఇంటి  దగ్గర  గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిశోర్ శుక్రవారం(జులై-6) తుపాకితో కాల్పుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అలర్టైన తోటి సిబ్బంది జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతానికి ప్రాణపాయం లేదని డాక్టర్లు తెలిపినప్పటికి బుల్లేట్‌ చాతి భాగంలో దూసుకెళ్లడంతో 24 గంటలు గడిస్తే గానీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టత వచ్చే అవకాశముందన్నారు ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని ఏకే 47తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిషోర్‌ది సూసైడా.. మిస్‌ ఫైరా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates